Sunday, September 27, 2020

" రెక్కల పిల్ల " పుస్తక సమీక్ష

పుస్తకం : రెక్కల పిల్ల 
రచయిత్రి :  Srisudha Modugu

నేను కొంచెం లేట్ గానే రాస్తున్న అని తెలుసు, కానీ ఎందుకో రాయలనిపిస్తుంది. సుధా ఆంటీ " రెక్కల పిల్ల" గురించి.

మొన్నొక సారి భాస్కర్ కె అంకుల్ మా ఇంటికి వచ్చినప్పుడు ఈ పుస్తకం చదవమని ఇచ్చారు. చిన్నప్పటినుండీ ఏ పుస్తకం చేతికొచ్చినా ముందు దాంట్లో ఉన్న బొమ్మలు చూడడమే అలవాటు కాడవడం తో పేజీలు తిరగేస్తూ టకటకా అన్ని బొమ్మలు చూడడం మొదలుపెట్టాను. చిన్ని చిన్ని కథలు ఉన్నాయి అందులో.Curiosity పెరిగింది. మొదటి కథ చదవడం స్టార్ట్ చేసాను..రెండో పేజ్ వరకూ వచ్చేలోపు అమ్మ రెండు సార్లు డిన్నర్ చేయడానికి పిలవడంతో డిన్నర్ చేసి కూర్చొని చదవడం స్టార్ట్ చేశా. Aruna Jyothi అక్క బొమ్మలు, సుధా ఆంటీ  కథనంతో 56 కథలు,వాటికి తగ్గ బొమ్మలతో ప్రతీ కథా నాకు కొత్త అనుభూతులను పంచింది. వాటి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్న. వింటారు కదూ..!!

ఒక మూడో తరగతి పిల్ల చుట్టూ పరిబ్రమించే కథలు ఇవన్నీ. వాళ్ళ ఇల్లు, స్కూలు, ఫ్రెండ్స్,జాతర, వాళ్ళ అమ్మమ్మ ఇల్లు, తన నిత్య జీవితంలో ఎదురైన సంఘటనలు , అనుభవాలు , నేర్చుకున్న పాఠాలు అన్ని తన ద్రుష్టికోణంలో రాసి ఉన్నాయి. ఇంకా సులభంగా చెప్పాలంటే ఆ పిల్ల డైరీ లాగా అనిపించింది నాకు.

ఈ పిల్ల బాల్యం ఇప్పటి పిల్లల్లా కాదు. బడి, బస్తాడు పుస్తకాలు, homework, video games, Tv , Smartphone , ఇవేమీ కాదు.  స్వచ్ఛమైన బాల్యం కనిపిస్తుంది ఇందులో. కాస్త కనెక్ట్ అయ్యారంటే అనుభవంలోకి కూడా వస్తుంది. 

ఆ ఆటలు, అల్లరి, అమాయకత్వం,ప్రశ్నలు, చిలిపితనం, ప్రేమ, స్వేచ్ఛ, మొండితనం, గ్రూపులు కట్టడం , గొడవలు పడడం , కోపాలు, మళ్లీ కలిసిపోవడం , అమ్మమ్మవల్ల ఇంటికి వెళ్ళడం , జాతరలో తిరగడం , పొన్నయి పూల దండలు చేయడం , బలపాలు తినడం, పీచుమిఠాయి కొనడం , రైలు పట్టాల మీద రూపాయి బిళ్ళలు పెట్టడం, tape recorder క్యాసెట్ నుంచి tape తియ్యడం, అమ్మతో చివాట్లు తినడం, తమ్ముడితో గొడవపడడం, ఇలా ఒక్కో కథలో  బోలెడు అనుభవాలు. నా తరం వారికి దూరపు చుట్టం ఐనా బాల్యం. నా ముందు తరాల వాళ్ళకి తెలియని బాల్యం ఉంటుంది. ఇందులోని ప్రతి కథలో ఒక freshness ఉంటుంది. ఇంకా బోలెడన్ని child psychology పాఠాలు నేర్చుకోవచ్చు.(బహుశా టీచర్ ట్రైనింగ్ ఎఫెక్ట్ కావచ్చు అన్ని అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో కనిపిస్తున్నాయ్)

చిన్ననాటి బాల్య స్మృతులు గుర్తుకొచ్చాయి..అని చెప్పేంత పెద్ద అవ్వలేదు కానీ. చిన్నప్పటి అల్లర్లు కొన్ని  కళ్ళ ముందు మెదిలాయి. బాల్యం అంటే ఇలా ఉండాలి కదా అనిపించింది.చదువుతున్నంత సేపు పెదవులపై ఒక చిరునవ్వు తొణికిసలాడుతుంది. 

ఎలాగో quarantine లోనే ఉన్నాం కదా. తీరిక లేదు అని అనకుండా హాయిగా ఈ పుస్తకం చదువుకోండి. రెక్కల పిల్లతో మళ్లీ బాల్యంలోకి  ఎగిరిపొండి.!

 ఇంతచక్కటి పుస్తకం నాకు ఇచ్చిన భాస్కర్ అంకుల్ కి చాలా థాంక్స్.
ఆ...అడగడం మర్చిపోయా. సుధా ఆంటీ....ఈ కథలలో రెక్కల పిల్ల కల్పితమా లేక అది మీరేనా?!

No comments:

Post a Comment