Sunday, September 27, 2020

"అహం బ్రహ్మాస్మి"

శ్రీ రామ నవమి కావడంతో పానకం కోసం బెల్లం కోరుతూ "అబబ్బ.... ఏం రోగాలో ఏమో. ఉగాదికి గుడికి వెళ్ళి పంచాంగం విందాం అంటే కుదరలేదు. ఇప్పుడు కళ్యాణం జరిపిడ్డాం అన్న కుదరట్లేదు. ఛీ ఛీ!" గొణిగింది బామ్మ. ఈ మాటలు విన్న చిట్టి " కళ్యాణం అంటే ఏంటి బామ్మ అని అడిగింది పక్కన కూర్చుంటూ. పెళ్లి నాన్న!మనం పోయిన సంవత్సరం రామాలయానికి వెళ్ళి రాముడికి సీతకి పెళ్లి చేయించాం గుర్తుందా? 
 ఆ! పప్పులు ఇంకా తియ్యటి నీళ్ళు ఇచ్చారు, అదే కదా? గుర్తు తెచ్చుకుంటూ అడిగింది చిట్టి. అవును నాన్నా! ఈసారి దగ్గరుండి కళ్యాణం జరిపించాలని అనుకున్నా. కానీ ఈ మాయదారి రోగం వల్ల కుదరట్లేదు . అప్పుడు పెళ్లి అయిపోయింది కదా, మళ్లీ ఎలా చేస్తావు అంది మెల్లగా కొంచెం బెల్లం తీసుకుంటూ.
 ఏయ్! తప్పు..దేవుడి ప్రసాదం అది. ఎంగిలి చెయ్యకూడదు అంది చిట్టి చేతిలోంచి బెల్లం తీసుకుంటూ. అబ్బా..నీ చాదస్తం కాకపోతే. ఏం అవుతాది పిల్ల తీసుకుంటే? ను వ్వే అంటావుగా పిల్లలు దేవుడు ఒకటే అని, పేపర్ లో తల దూర్చుతూ. "వితండవాదం చేసి పిల్లని చెడగొట్టకు" విసుక్కుంది బామ్మ.
"రాముడు దేవుడా బామ్మ" చాలా సీరియస్ గా అడిగింది చిట్టి.
"అవునమ్మా. చాలా మంచి దేవుడు" కాన్ఫిడెంట్ గా చెప్పింది బామ్మ.
" దేవుళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారా?" Confused ga అడిగింది చిట్టి.
"అవునమ్మ! రాముడు విష్ణువు రూపం. మనుషులని ఇబ్బంది పెట్టే రాక్షసులని చంపడానికి మనిషిలా భూమి మీదకి వచ్చాడు" క్లారిటీ ఇచ్చింది బామ్మ.
"ఇప్పుడు ఎక్కడున్నాడు? మన దగ్గరకు వస్తాడా?" అడిగింది చిట్టి.
ఆయన పని అయిపోయింది కదా నాన్న. మళ్లీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
"వెళ్లిపోయాడా? మళ్లీ రాడా?"
"వస్తాడు. మనుషులకి ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి వస్తాడు నాన్నా"
"నీకెలా తెలుసు?"
"ఆయనే చెప్పాడు నాన్న. 

"పరిత్రాణాయ సాధూనాం - వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ - సంభవామి యుగే యుగే'

ధర్మాన్ని కాపాడడానికి చెడుని నాశనం చేయడానికి ప్రతి యుగంలో నేను వస్తాను అని అన్నాడు నాన్న"

"మనకి కరోనా వల్ల ప్రాబ్లెమ్ వచ్చింది కదా? మరి వస్తాడా ఇప్పుడు?" అనుమానం వచ్చింది చిట్టి.
"ఆ! వస్తాడు" ఆన్సర్ లేక అసహనం వచ్చింది బామ్మకి.
" ఎలా వస్తాడు? ఏ రూపంలో వస్తాడు?ఎలా చంపుతాడు కరోనాని?"ప్రశ్నల వర్షం కురిపించింది చిట్టి.
"ఎహే! ఏదోకటి చేస్తాడులే కానీ...లేట్ అయిపోతుంది,వెళ్ళి ప్రసాదం చెయ్యాలి ఆగు." అని బామ్మ లేచి వెళ్లిపోయింది.
తన ప్రశ్నలకి సమాధానం దొరకలేదని చిన్నబోయిన చిట్టి చూసి చిన్నగా నవ్వి " ఏం అయింది తల్లి?నేను చెప్తా దా" అని బుజ్జగింపు గా పిలిచాడు చిట్టి వల్ల నాన్న.
గబగబా పక్కని ఉన్న స్టూల్ ని వల్ల నాన్న ఎదురుగా వేసుకుంది.మళ్లీ ఆయన distract అవ్వకుండా! 
" చూడు తల్లి! దేవుడంటే ఎక్కడో ఉండదు. మనకి మంచి చేసే వాళ్ళు దేవుడే. మనం మంచి చేస్తే మనమే దేవుడు. దేవుడు మన చుట్టూ ఉన్నాడు.మన తోనే ఉన్నాడు.మనలోనే ఉన్నాడు నాన్న. మరి చెప్పు నువ్వు గుడ్ గర్ల్ వేనా?"నవ్వుతూ అడిగాడు వల్ల నాన్న.
"ఆ ఆ గుడ్ గర్ల్ ఏ కానీ, మనలో దేవుడు ఉన్నాడు అన్నవ్ కదా. మరి నాలో ఉన్నాడా?"ఆశ్చర్యం తో అడిగింది.
"ఉన్నాడు నాన్న." నమ్మకంగా చెప్పాడు వల్ల నాన్న.
"మరి మనం కరొనని చంపెయ్యొచ్చా? నేను దానితో ఎలా ఫైట్ చెయ్యాలి?బయటకి కూడా వెళ్ళకూడదు కదా??"
" దానితో ఫైట్ చేయడానికి బయటకి వెళ్లక్కర్లేదు నాన్న, ఇంట్లోనే ఉంటూ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు కడుక్కుని ఉండాలి. కొంచెం జాగ్రత్త.కొంచెం శుబ్రతతో మనం చంపెయ్యచ్చు నాన్న." 
" అయితే నేను సూపర్ దేవుడిని....నేను నీట్ గా ఉంటూ..కరోనని చంపేస్తా...... జరగండి జరగండి...నేను ఫైట్ చెయ్యాలి...అందర్నీ కాపాడాలి." అని చేతులు కడుక్కోడానికి సింక్ దగ్గరకి పరిగెత్తింది.
"Hmmm.... పిచ్చి పిల్లా!! అయినా అంతేగా... ' అహం బ్రహ్మాస్మి ' అనుకుంటూ పేపర్ లో తల దూర్చాడు వాళ్ళ నాన్న.
                                                   
   

                                                                    

No comments:

Post a Comment