Sunday, September 27, 2020

" రెక్కల పిల్ల " పుస్తక సమీక్ష

పుస్తకం : రెక్కల పిల్ల 
రచయిత్రి :  Srisudha Modugu

నేను కొంచెం లేట్ గానే రాస్తున్న అని తెలుసు, కానీ ఎందుకో రాయలనిపిస్తుంది. సుధా ఆంటీ " రెక్కల పిల్ల" గురించి.

మొన్నొక సారి భాస్కర్ కె అంకుల్ మా ఇంటికి వచ్చినప్పుడు ఈ పుస్తకం చదవమని ఇచ్చారు. చిన్నప్పటినుండీ ఏ పుస్తకం చేతికొచ్చినా ముందు దాంట్లో ఉన్న బొమ్మలు చూడడమే అలవాటు కాడవడం తో పేజీలు తిరగేస్తూ టకటకా అన్ని బొమ్మలు చూడడం మొదలుపెట్టాను. చిన్ని చిన్ని కథలు ఉన్నాయి అందులో.Curiosity పెరిగింది. మొదటి కథ చదవడం స్టార్ట్ చేసాను..రెండో పేజ్ వరకూ వచ్చేలోపు అమ్మ రెండు సార్లు డిన్నర్ చేయడానికి పిలవడంతో డిన్నర్ చేసి కూర్చొని చదవడం స్టార్ట్ చేశా. Aruna Jyothi అక్క బొమ్మలు, సుధా ఆంటీ  కథనంతో 56 కథలు,వాటికి తగ్గ బొమ్మలతో ప్రతీ కథా నాకు కొత్త అనుభూతులను పంచింది. వాటి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్న. వింటారు కదూ..!!

ఒక మూడో తరగతి పిల్ల చుట్టూ పరిబ్రమించే కథలు ఇవన్నీ. వాళ్ళ ఇల్లు, స్కూలు, ఫ్రెండ్స్,జాతర, వాళ్ళ అమ్మమ్మ ఇల్లు, తన నిత్య జీవితంలో ఎదురైన సంఘటనలు , అనుభవాలు , నేర్చుకున్న పాఠాలు అన్ని తన ద్రుష్టికోణంలో రాసి ఉన్నాయి. ఇంకా సులభంగా చెప్పాలంటే ఆ పిల్ల డైరీ లాగా అనిపించింది నాకు.

ఈ పిల్ల బాల్యం ఇప్పటి పిల్లల్లా కాదు. బడి, బస్తాడు పుస్తకాలు, homework, video games, Tv , Smartphone , ఇవేమీ కాదు.  స్వచ్ఛమైన బాల్యం కనిపిస్తుంది ఇందులో. కాస్త కనెక్ట్ అయ్యారంటే అనుభవంలోకి కూడా వస్తుంది. 

ఆ ఆటలు, అల్లరి, అమాయకత్వం,ప్రశ్నలు, చిలిపితనం, ప్రేమ, స్వేచ్ఛ, మొండితనం, గ్రూపులు కట్టడం , గొడవలు పడడం , కోపాలు, మళ్లీ కలిసిపోవడం , అమ్మమ్మవల్ల ఇంటికి వెళ్ళడం , జాతరలో తిరగడం , పొన్నయి పూల దండలు చేయడం , బలపాలు తినడం, పీచుమిఠాయి కొనడం , రైలు పట్టాల మీద రూపాయి బిళ్ళలు పెట్టడం, tape recorder క్యాసెట్ నుంచి tape తియ్యడం, అమ్మతో చివాట్లు తినడం, తమ్ముడితో గొడవపడడం, ఇలా ఒక్కో కథలో  బోలెడు అనుభవాలు. నా తరం వారికి దూరపు చుట్టం ఐనా బాల్యం. నా ముందు తరాల వాళ్ళకి తెలియని బాల్యం ఉంటుంది. ఇందులోని ప్రతి కథలో ఒక freshness ఉంటుంది. ఇంకా బోలెడన్ని child psychology పాఠాలు నేర్చుకోవచ్చు.(బహుశా టీచర్ ట్రైనింగ్ ఎఫెక్ట్ కావచ్చు అన్ని అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో కనిపిస్తున్నాయ్)

చిన్ననాటి బాల్య స్మృతులు గుర్తుకొచ్చాయి..అని చెప్పేంత పెద్ద అవ్వలేదు కానీ. చిన్నప్పటి అల్లర్లు కొన్ని  కళ్ళ ముందు మెదిలాయి. బాల్యం అంటే ఇలా ఉండాలి కదా అనిపించింది.చదువుతున్నంత సేపు పెదవులపై ఒక చిరునవ్వు తొణికిసలాడుతుంది. 

ఎలాగో quarantine లోనే ఉన్నాం కదా. తీరిక లేదు అని అనకుండా హాయిగా ఈ పుస్తకం చదువుకోండి. రెక్కల పిల్లతో మళ్లీ బాల్యంలోకి  ఎగిరిపొండి.!

 ఇంతచక్కటి పుస్తకం నాకు ఇచ్చిన భాస్కర్ అంకుల్ కి చాలా థాంక్స్.
ఆ...అడగడం మర్చిపోయా. సుధా ఆంటీ....ఈ కథలలో రెక్కల పిల్ల కల్పితమా లేక అది మీరేనా?!

"అహం బ్రహ్మాస్మి"

శ్రీ రామ నవమి కావడంతో పానకం కోసం బెల్లం కోరుతూ "అబబ్బ.... ఏం రోగాలో ఏమో. ఉగాదికి గుడికి వెళ్ళి పంచాంగం విందాం అంటే కుదరలేదు. ఇప్పుడు కళ్యాణం జరిపిడ్డాం అన్న కుదరట్లేదు. ఛీ ఛీ!" గొణిగింది బామ్మ. ఈ మాటలు విన్న చిట్టి " కళ్యాణం అంటే ఏంటి బామ్మ అని అడిగింది పక్కన కూర్చుంటూ. పెళ్లి నాన్న!మనం పోయిన సంవత్సరం రామాలయానికి వెళ్ళి రాముడికి సీతకి పెళ్లి చేయించాం గుర్తుందా? 
 ఆ! పప్పులు ఇంకా తియ్యటి నీళ్ళు ఇచ్చారు, అదే కదా? గుర్తు తెచ్చుకుంటూ అడిగింది చిట్టి. అవును నాన్నా! ఈసారి దగ్గరుండి కళ్యాణం జరిపించాలని అనుకున్నా. కానీ ఈ మాయదారి రోగం వల్ల కుదరట్లేదు . అప్పుడు పెళ్లి అయిపోయింది కదా, మళ్లీ ఎలా చేస్తావు అంది మెల్లగా కొంచెం బెల్లం తీసుకుంటూ.
 ఏయ్! తప్పు..దేవుడి ప్రసాదం అది. ఎంగిలి చెయ్యకూడదు అంది చిట్టి చేతిలోంచి బెల్లం తీసుకుంటూ. అబ్బా..నీ చాదస్తం కాకపోతే. ఏం అవుతాది పిల్ల తీసుకుంటే? ను వ్వే అంటావుగా పిల్లలు దేవుడు ఒకటే అని, పేపర్ లో తల దూర్చుతూ. "వితండవాదం చేసి పిల్లని చెడగొట్టకు" విసుక్కుంది బామ్మ.
"రాముడు దేవుడా బామ్మ" చాలా సీరియస్ గా అడిగింది చిట్టి.
"అవునమ్మా. చాలా మంచి దేవుడు" కాన్ఫిడెంట్ గా చెప్పింది బామ్మ.
" దేవుళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారా?" Confused ga అడిగింది చిట్టి.
"అవునమ్మ! రాముడు విష్ణువు రూపం. మనుషులని ఇబ్బంది పెట్టే రాక్షసులని చంపడానికి మనిషిలా భూమి మీదకి వచ్చాడు" క్లారిటీ ఇచ్చింది బామ్మ.
"ఇప్పుడు ఎక్కడున్నాడు? మన దగ్గరకు వస్తాడా?" అడిగింది చిట్టి.
ఆయన పని అయిపోయింది కదా నాన్న. మళ్లీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
"వెళ్లిపోయాడా? మళ్లీ రాడా?"
"వస్తాడు. మనుషులకి ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి వస్తాడు నాన్నా"
"నీకెలా తెలుసు?"
"ఆయనే చెప్పాడు నాన్న. 

"పరిత్రాణాయ సాధూనాం - వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ - సంభవామి యుగే యుగే'

ధర్మాన్ని కాపాడడానికి చెడుని నాశనం చేయడానికి ప్రతి యుగంలో నేను వస్తాను అని అన్నాడు నాన్న"

"మనకి కరోనా వల్ల ప్రాబ్లెమ్ వచ్చింది కదా? మరి వస్తాడా ఇప్పుడు?" అనుమానం వచ్చింది చిట్టి.
"ఆ! వస్తాడు" ఆన్సర్ లేక అసహనం వచ్చింది బామ్మకి.
" ఎలా వస్తాడు? ఏ రూపంలో వస్తాడు?ఎలా చంపుతాడు కరోనాని?"ప్రశ్నల వర్షం కురిపించింది చిట్టి.
"ఎహే! ఏదోకటి చేస్తాడులే కానీ...లేట్ అయిపోతుంది,వెళ్ళి ప్రసాదం చెయ్యాలి ఆగు." అని బామ్మ లేచి వెళ్లిపోయింది.
తన ప్రశ్నలకి సమాధానం దొరకలేదని చిన్నబోయిన చిట్టి చూసి చిన్నగా నవ్వి " ఏం అయింది తల్లి?నేను చెప్తా దా" అని బుజ్జగింపు గా పిలిచాడు చిట్టి వల్ల నాన్న.
గబగబా పక్కని ఉన్న స్టూల్ ని వల్ల నాన్న ఎదురుగా వేసుకుంది.మళ్లీ ఆయన distract అవ్వకుండా! 
" చూడు తల్లి! దేవుడంటే ఎక్కడో ఉండదు. మనకి మంచి చేసే వాళ్ళు దేవుడే. మనం మంచి చేస్తే మనమే దేవుడు. దేవుడు మన చుట్టూ ఉన్నాడు.మన తోనే ఉన్నాడు.మనలోనే ఉన్నాడు నాన్న. మరి చెప్పు నువ్వు గుడ్ గర్ల్ వేనా?"నవ్వుతూ అడిగాడు వల్ల నాన్న.
"ఆ ఆ గుడ్ గర్ల్ ఏ కానీ, మనలో దేవుడు ఉన్నాడు అన్నవ్ కదా. మరి నాలో ఉన్నాడా?"ఆశ్చర్యం తో అడిగింది.
"ఉన్నాడు నాన్న." నమ్మకంగా చెప్పాడు వల్ల నాన్న.
"మరి మనం కరొనని చంపెయ్యొచ్చా? నేను దానితో ఎలా ఫైట్ చెయ్యాలి?బయటకి కూడా వెళ్ళకూడదు కదా??"
" దానితో ఫైట్ చేయడానికి బయటకి వెళ్లక్కర్లేదు నాన్న, ఇంట్లోనే ఉంటూ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు కడుక్కుని ఉండాలి. కొంచెం జాగ్రత్త.కొంచెం శుబ్రతతో మనం చంపెయ్యచ్చు నాన్న." 
" అయితే నేను సూపర్ దేవుడిని....నేను నీట్ గా ఉంటూ..కరోనని చంపేస్తా...... జరగండి జరగండి...నేను ఫైట్ చెయ్యాలి...అందర్నీ కాపాడాలి." అని చేతులు కడుక్కోడానికి సింక్ దగ్గరకి పరిగెత్తింది.
"Hmmm.... పిచ్చి పిల్లా!! అయినా అంతేగా... ' అహం బ్రహ్మాస్మి ' అనుకుంటూ పేపర్ లో తల దూర్చాడు వాళ్ళ నాన్న.
                                                   
   

                                                                    

Sunday, September 6, 2020

Book Review : Sita - Warrior of Mithila by Amish Tripathi

Quarantine writings 
Sita : The Warrior of Mithila

Click here to watch the review of the book by me..



నిన్న సాయంత్రం ఎందుకో ఈ పుస్తకం చదవాలనిపించి స్టార్ట్ చేసా......

Sita : The Warrior of Mithila, Amish Tripathi రాసిన రామచంద్ర సీరీస్ లోని రెండవ పుస్తకం ఇది.మొదటిది Rama: Scion of Ikshwaku , మూడోది Raavan: Enemy of Aryavarta. 
ఈ పుస్తకం లో మొత్తం 32 chapters ఉన్నాయి. నిన్నటితో 10 chapters చదవడం పూర్తయింది. మరి అంత తొందరెందుకు మొత్తం చదివి ర్రాయొచ్చుగా అంటారా..?? రాయాలనిపించింది అంతే....రాస్తున్నా!!

ఈ పుస్తకం యొక్క Genre ఫిక్షన్ ఏ అయినప్పటికీ అంతా నిజమేనేమో అనిపిస్తది.Infact ఇదే వాస్తవమేమో అనిపిస్తుంది. మిగతా కథలన్నీ ఈ కథకి exaggerations కలిపి చెప్తున్నారేమో అనిపిస్తుంది.

భాష మరియు terminology కూడా వాడుక భాషలోవే. అప్పటి ప్రాంతాల పేర్లతో పాటూ ఇప్పుడు మారిన/మనకి తెలిసిన పేర్లు కూడా ఇవ్వడంతో ఇంకా సులభంగా వాళ్ళ ప్రయాణాన్ని visualise చేసుకోవచ్చు.

ఇప్పటివరకు నేను చదివిన/విన్న versions అన్నిటికీ భిన్నంగా ఉంది ఇది.ఉదాహరణకి జటాయువు అంటే మాటలు వచ్చిన పెద్ద గరుడ పక్షి అనే తెలుసు నాకు,కానీ ఇందులో, genetic disorder వల్ల గద్ద ఆకారంలో ఉన్న మొహంతో పుట్టిన మనిషే అని చెప్తాడు.అలాగే నాగ,రుద్ర,మలయపుత్ర,వానర, ఇలా వేరు వేరు తెగల వాళ్ళు వేరు వేరు బాధ్యతలని నిర్వహించాల్సి ఉంటుంది.(అంతా మనుషులే! No super or supernatural powers).

అస్సలు ఫస్ట్ chapter ఏ మస్త్ అనిపిస్తది....ఇప్పటివరకు, అరణ్యవాస సమయంలో రావణాసురుని నిజ రూపం చూసి మూర్ఛ పోయిన సీతే తెలుసు, కానీ నిన్న, యాభై మంది లంక వీరులతో వీరోచిత పోరాటం చేసిన సీతని కలిసా.భలే అనిపించింది..(first version creates a sense of sympathy towards her helplessness while this one builds immense respect towards her )సీతని కాపాడుతూ జటాయువు చనిపోవడం కాదు, జటాయువుని కాపాడడం కోసం సీత పోరాడి ఓడుతుంది.
అయినా,చిన్నప్పుడే శివ ధనుస్సుని ఒంటి చేత్తో పక్కకు నెట్టిన సీత, అలా మూర్ఛ పోయి surrender అయ్యిందంటే ఇన్నిరోజులు ఎలా నమ్మానబ్బా..?! 

అంతెందుకు, నిన్నటివరకు నాకు సీత వాళ్ళ అమ్మ,జనకుని భార్య,మిథిలా నగర రాణి పేరు తెలియదు.కరువులో ఉన్న రాజ్యాన్ని మళ్లీ సస్యశ్యామలంగా మార్చిన ఆమె గురించి ఇప్పటివరకు నేను చూసిన/చదివిన/విన్న  ఏ రామాయణం లోనూ ప్రస్తావించలేదు.ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా.."సునైన ( Sunaina ) " గుర్తుంచుకోండి..!
సీత అంత గొప్ప స్త్రీ గా మారడానికి ముఖ్య పాత్ర పోషించింది.

చెప్పలేదు కదా, సీత గురుకులంలో చదువుకునేటప్పుడు తన best friend వాళ్ళ అన్న, పరిచయం అవుతాడు.తను secret mission పైన వేరు వేరు ప్రాంతాలు తిరుగుతుంటాడు.తన పేరు "హనుమాన్".

ఇలా చాలా 'అవునా!' , 'నిజమా' , 'నిజమేకద' , 'నిజమే అయ్యుంటుంది' అనుకునే విషయాలు చాలా ఉన్నాయి.

అసలు మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. విశ్వామిత్రుడికి ఒక ముఖ్యమైన భాద్యత నిర్వహించాల్సి ఉంది. అదేంటంటే, next విష్ణువు ని గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించడానికి / లోకకళ్యాణం కోసం సిద్ధం చేయడం. ఆ విష్ణువు/ విష్ణు స్వరూపం,  రుద్ర ( శివ స్వరూపం ) తెగవాళ్ల సహకారంతో పని చేస్తారు. అంతకు ముందు విష్ణువైన పరశురాముడు కూడా అంతేఅట.

అయితే, విశ్వామిత్రుడు Obviously రాముడినే select చేస్తాడనుకున్నా. కానీ ఇక్కడ  విశ్వామిత్రుడు next విష్ణువుగా ఎంచుకుంది సీతని!!

సీతతో యజ్ఞం చేయించి మరీ ఆమెకి విష్ణువు representative అని చెప్పే fish symbol ఉన్న కత్తిని కూడా ఇస్తారు.

ఇది జరిగిన కొన్ని రోజులకు సీత వాళ్ళ అమ్మ సునైనా అనారోగ్యం తో చనిపోతుంది.చనిపోవడానికి ముందు సీతదగ్గర ఎప్పుడూ గతం గురించి ఆలోచించి బాధ పడొద్దు.ధైర్యంగా ఉండాలి.రాజ్యాన్ని దేశాన్ని కాపాడుతూ అభివృద్ధి దిశగా నడిపించాలని మాట తీసుకుంటుంది.అలాగే అందర్నీ గుడ్డిగా నమ్మొద్దు అనికూడా చెప్తుంది.అంతే అక్కడితో chaper 10 పూర్తయింది.

 ఇప్పటివరకు తెలిసిన version కి complete opposite గా సీతని తర్వాతి విష్ణువుగా ఎంచుకోడమేంటి? 

*****************************************

సీత వాళ్ళ అమ్మ సునైన చనిపోతుంది కదా..ఆ తర్వాత సీత మిథిల prime minister / రాణి అవుతుంది.సీత రాజ్యాన్ని చక్కగా చేసుకుంటునే రహస్యంగా  తన విష్ణు శిక్షణ కోసం అగస్త్య కూటమికి వెళ్తుంటుంది.అదొక గుప్త ప్రదేశం మలయపుత్రులకి తప్ప దాని గురించి ఎవ్వరికీ తెలీదు.

సరే...అదలా ఉంచితే...

నేను ఇంతకుముందు చెప్పినట్టు. వశిష్ఠుడు రాముడిని తర్వాతి విష్ణువుగా ప్రకటిద్దామనుకుంటున్నాడు. విశ్వామిత్రుడేమో సీతని. అయితే సీతకి ఒక ఆలోచన వస్తుంది. సీత రాముడిని పెళ్లి చేసుకుంటే........ఇద్దరు విష్ణువులు ఎందుకు ఉండకూడదు? ఇద్దరూ కలసి వాళ్ళ ధర్మాన్ని ఇంకా బాగా నిర్వర్తించొచ్చు కదా అనుకుంది. 

వాళ్ళ నాన్న జనకుడిని అడిగి స్వయంవరం ఏర్పాట్లు చేయించుకుంది. విశ్వామిత్రునికి చెప్పి రామ లక్ష్మణులను మిథిలకి రప్పించింది.

కానీ ఇక్కడ చిక్కేంటంటే, విశ్వామిత్రుడికి వశిష్టుడికీ పడదు. చిన్నప్పుడు ఇద్దరు ఒకే గురుకులంలో చదువుకున్నారు.ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. నిజానికి వశిష్టుడిని గురుకులంలో చేర్చిందే విశ్వామిత్రుడు.మరి తర్వాత ఏమైందో ఏమో ఇద్దరూ బద్ద శత్రువులవులుగా మారతారు. వాళ్ళిద్దరూ ఇద్దరు విష్ణువులంటే  ఒప్పుకుంటారో లేదో తెలీదు.

స్వయంవరానికి ముందు సమిచి ( రక్షక దళ ప్రధానాధికారి) .సీత నా అనుకునే, నమ్మదగిన వాళ్ళల్లో సమిచి ఒకతి సీతతో రాముడి ప్రాణానికి ప్రమాదం ఉంది వెళ్ళిపోమని చెప్పు అని చెప్తుంది.కానీ సీత తేలికగా తీసుకుంటుంది. ఊర్మిళ సమిచిలతో వెళ్లి  రాముడిని కలిసి మాట్లాడుతుంది. స్వయంవరంలో ఎటువంటి పోటీ పెడతారో చెప్పి సాధన చెయ్యడానికి ' పినాక ' ( అంతకు ముందు ఉన్న మహాదేవుని ధనస్సు పేరు అది / శివ ధనస్సు )ని తీసుకొని వెళ్తుంది. కానీ రాముడు న్యాయంగా పాల్గొంటానని చెప్తాడు.

స్వయంవరం రోజు రానేవచ్చింది. ఎవరు పిలిచారో తెలీదు కానీ తన పుష్పక విమానం వేసుకొని కుంభకర్ణుడు ఇంకా తన సైన్యాన్ని వేసుకొని రావణాసురుడు కూడా వస్తారు. {ఇక్కడ పుష్పక విమానం అంటే,ఏదో మాయల వల్ల ఎగిరే రెక్కల పెట్టే అని చెప్పలేదు, లంక వాళ్ళు నిర్మించుకున్న శంఖువు ఆకారంలో (conical shape)లో ఉండే  ఒక ఎగిరే వాహనం }
చెప్పలేదు కదా! రావణాసురుడు విశ్వామిత్రుడు దూరపు చుట్టాలవుతారట..!

మనకి తెలిసినట్టే, రావణుడికి అవమానం జరుగుతుంది, ఆయన కోపంతో వెళ్ళిపోతాడు.రాముడు శివధనస్సు తో  ceiling పైన రౌండ్ రౌండ్ గా తిరుగుతున్న చేప బొమ్మని, దాని కింద కదులుతున్న నీళ్లలో చూసి బాణంతో కొట్టే task పూర్తి చేస్తాడు. సీత రాముల పెళ్లితో పాటు లక్ష్మణుడు ఊర్మిళల పెళ్లి కూడా అవుతుంది.

ఆ తర్వాతి రాత్రి రావణుడు మిథిల మీద దండెత్తుతాడు.( ఆయనకి రాత్రి పూట యుద్దం చెయ్యడం తప్పని తెలిసినా,చేస్తాడు). ఎంత ప్రయత్నించినా వాళ్ళని ఎదుర్కోవడం కష్టమే అవుతుంటుంది.మిథిల గెలవాలంటే వాళ్ళకి ఉన్న ఏకైక మార్గం ఒక nuclear weapon లాంటి ' దైవాస్త్రాన్ని 'వాడటం. దాని వల్ల వాళ్ళ ప్రత్యర్ధులు మూర్ఛ పోవచ్చు లేదా 3-4 వారాలు కోమా లోకి వెళ్లిపోవచ్చు) అయితే వాయుపుత్ర తెగ వాళ్ళ అనుమతులు లేకుండా దాన్ని వాడితే 14 సంవత్సరాలు వనవాసం చెయ్యల్సి వుంటుందని పూర్వ మహదేవుని నిబంధన. రాముడు సీతా లక్ష్మణులు మహా దేవుడి భక్తులు.ఆయన కట్టడి జవదాటడం ఇష్టం లేక దానికి ఒప్పుకోరు.

సీత లేని సమయం చూసి విశ్వామిత్రుడు రాముడిని రెచ్చగొట్టి,emotional blackmail చేసి రాముడే ఆ అస్త్రం లంక సైన్యం మీద వాడేటట్టు చేస్తాడు.

లంక సైన్యం మూర్చపోయింది. రావణుడు కుంభకర్ణుడు ఇంకా కొంతమంది సైన్యం ఆ గాలి మోటార్ ఎక్కి లంకకి బయలుదేరుతారు.మూర్ఛ పోయిన లంక సైనికులని అగస్త్య కూటమికి తీసుకెళ్ళి చికిత్స చేస్తారు.వాళ్ళు  కోలుకున్నాక లంకతో మళ్లీ మిథిల మీద దాడి చెయ్యకుండా రాయబారం జరపొచ్చనేది వ్యూహం.

కానీ సీతకి విశ్వామిత్రుడి మీద పట్టలేనంత కోపం వచ్చింది." నేను వద్దన్నా ఆ అస్త్రాన్ని ఎందుకు వాడారు.అంత తప్పని పరిస్థితే వస్తే మీరే వాడొచ్చు కదా.రాముడు వాడేటట్టు ఎందుకు చేశారు" అని కోప్పడింది.

కానీ జరగాల్సింది జరిగిపోయింది. రాముడు మహాదేవుని నిబంధన అతిక్రమించాడు.14 యేళ్లు  వనవాసం చెయ్యాలి. అయితే వాయుపుత్రులకి ఈ పరిస్థితి వివరిస్తే అరణ్య వాసం నుంచి మినహాహింపు ఇస్తారు కావొచ్చు.కానీ రాముడు ససేమిరా అంటున్నాడు కదా...! 

తర్వాత ఏం అయ్యిందో చెప్పాలని ఉందిలే కానీ, ఇలా కుదరదు...మీరే వీలు చేసుకొని బుక్ చదవండి.అందులో ఉండే fine details, ఆ expressions ,  side track లో నడిచే కొన్ని కథలు, flash back లు, లాంటివాటినన్నిటినీ ఒక్క పోస్ట్ లో నేను చెప్పేదానికంటే మీరు చదువుతూ అనుభూతి చెందితేనే బావుంటుందని అనిపించింది.ఏమంటారు...అంతేగా!!!

Click here to watch the review..


Thanks for reading ❤️
- Rakshita Suma

Thursday, September 3, 2020

కొత్త తరం కథలు

"చిరుగుతున్న ఆకాశం"

అనగనగా ఒక అడవిలో, ఒక చిట్టి కుందేలు చెట్టు కింద కునుకు తీస్తోంది. అకస్మాత్తుగా దానికి ఏదో వింత శబ్ధం వినిపించింది.ఏదో చిరిగినట్టు..!ఏదోలే అనుకొని మళ్లీ నిద్రలోకి జారుకుంది.అంతలో మళ్లీ ఆ శబ్ధం వినిపించింది.ఎందుకో కాస్త అనుమానం వచ్చి చుట్టూ చూసింది. ఏమీ కనపడకపోవడంతో మళ్లీ చెట్టుకిందకొచ్చి కూర్చుంది.ఈసారి ఆ శబ్ధం కాస్త గట్టిగా ఇంకాఎక్కువ సేపు కొనసాగింది.చుట్టూ ఎవ్వరూ కనపడట్లేదు, కానీ శబ్ధం మాత్రం వస్తోంది.ఏంటబ్బా అని ఆలోచిస్తూ పైకి చూసింది.అంతే దానికి వెన్నులో వణుకు పుట్టింది. "ఆకాశం చిరిగుపోతోందీ..........." అనుకుంటూ పరుగందుకుంది.

"ఏంటి కుందేలు, ఏమైంది అలా పరిగెడుతున్నావు ?" భయంతో పరిగెత్తుతున్న కుందేలును చూసి పొదల్లో ఉన్న జింక అడిగింది.
"ఆకాశం చిరిగిపోతోంది, పదా నువ్వు కూడా పరిగెత్తు..."ఆయాసపడుతూ చెప్పింది కుందేలు.
"నీ మోహంలే, అప్పట్లో మీ తాత కూడా ఇట్లనే చేసిండు.ఆకాశం విరిగిపోతుంది విరిగిపోతుంది అని మమ్మల్ని అడవంతా పరిగెట్టిచ్చిండు.తీరా చూస్తే అది చెట్టు మీదనుంచి పడ్డ కొబ్బరి బొండం చప్పుడు..!! నువ్వు కూడా అలాంటిదే ఏదో విని ఆకాశం చిరిగిపోతుందనుకున్నవేమో" అని తాపీగా గడ్డి నములుతూ చెప్పింది జింక.
" నేను నిజంగానే విన్నా, కావాలంటే రా, నీక్కూడా వినిపిస్తా,"కోపంగా చెప్పింది కుందేలు.
"అంత కోపమెందుకులే కానీ, పద చూద్దాం" అంది జింక.
ఇద్దరూ కుందేలు పడుకున్న దగ్గరికి వెళ్ళారు.వాళ్ళకి మళ్లీ ఆ శబ్దం వినిపించింది.వెంటనే కుందేలు " చూసావా నేను చెప్తే నువ్వు నమ్మలేదు.. ఇప్పుడేమంటావ్..!" గాబరా గా చుట్టూ చూస్తున్న జింక ని అడిగింది." ఇంకేమంటా.....!పదా పరిగెత్తూ......" 
కుందేలూ,జింకా పరుగందుకున్నాయ్.

కాస్త దూరం వెళ్ళగానే వాటికి నక్క ఎదురైంది.పరిగెడుతున్న కుందేలు జింకను చూసి ఏమైందని ఆరాతీసింది.అవి విషయం చెప్పగానే," ఈ కుందేళ్ళ సంగతి తెలిసి కూడా నువ్వు మళ్లీ ఎలా పిచ్చిదానివయ్యావు..? ఏ కొబ్బరి బొండమో, తాటి మట్టో పడి ఉంటుంది" అని ఎగతాళి చేసింది.
"లేదు లేదు నక్క బావ నేను నా చెవులతో విన్నాను"అని ఆయాసపడుతూ చెప్పింది జింక".
 స్వయంగా వింటే తప్ప నమ్మను అని నక్క పట్టుపట్టేసరికి,చేసేదేం లేక మళ్లీ కుందేలు ఉండే place కి తీస్కెళ్ళాయి.
ఆ శబ్ధం విని ఆశ్యర్యపోతున్న నక్కతో "ఇప్పటికైనా నమ్ముతావా..ఇగ పదా,ఇప్పటికే ఆలస్యమైంది.ఇన్ని సార్లు వెనక్కీ ముందుకీ పరిగెడితే మధ్యలోనే ఆ చిరిగిన ఆకాశం మనమీద పడిపోతది.మళ్లీ వెనక్కి రావద్దు పదండి పరిగెడదాం"వణుకుతూ చెప్పింది కుందేలు. నక్క, జింక, కుందేలూ పరుగందుకున్నాయి.

"ఏమైంది మీకు, నేను ఇక్కడ ఉండగా మిమల్ని ఎవరు తరుముతున్నారు.. అంత భయంతో పరిగెడుతున్నారు."నవ్వుతూ అడిగింది పులి.
"ఆకాశం చిరిగిపోతోంది పులిగారు.మీరు కూడా పరిగెట్టండి.లేకపోతే మీ ప్రాణానికే ప్రమాదం" అత్యంత వినయంగా చెప్పింది నక్క.
"అవునా....! ఎవరు చెప్పారు!"ఇంకా గట్టిగా నవ్వుతూ అడిగింది పులి.
"కుందేలు ఇంటిదగ్గర విన్నాం"జింక చెప్పింది.
" వెర్రి మోహాల్లారా...ఆకాశం చిరిగిపోవడం ఏంటి.అయినా ఈ కుందేళ్ళ సంగతి తెలుసుకదా.. ఒకసారి ఆకాశం విరుగుతుందంటారు.ఇప్పుడు చిరిగుతుందంటున్నరు.మీరెందుకు అనవసరంగా వీళ్ళ మాటలు నమ్మి  భయపడి చస్తున్నారు?" చిరాగ్గా అంది పులి.
" అయ్యయ్యో కాదండీ...! నేను స్వయంగా నా స్వకర్ణాలతో విన్నానండీ" ఇంకా వంగిపోతూ చెప్పింది నక్క."
"వేటితో విన్నావు... స్వక.... ఏంటవీ....??
"నా సొంత చెవులతో విన్నానని అంటున్నానండి"
"మరి అలా ఏడవచ్చుగా...!"నక్క అతి వినయానికి చిరాకు పుట్టి గుర్రుమంది పులి
"అయ్యో ఈ నక్క బావ సంగతి మనకి తెలిసిందే కదా! బతికుంటే ఆదే చాలు.పదండి పరిగెడదాం."తొందర పెట్టింది జింక.
"ఇవన్నీ చెప్తున్నయంటే,నిజమే కావొచ్చు ఏముందిలే పరిగెడితే పోలా...!"అనుకుని వాటితో పాటు పరుగందుకుంది పులి.

అలా భయంతో పరిగెడుతున్న పులి, నక్క,జింక ,కుందేలు గట్టిగా వినపడ్డ ఘర్జనకి ఆగాయి."ఎక్కడికి మీరంతా గుంపుగా పరిగెడుతున్నారు.?బయట కరోనా వస్తుందట, ఇలా గుంపులుగా తిరగొద్దని నేను ఆజ్ఞాపించినది మర్చిపోయారా..??" కోప్పడింది సింహ రాణి.
"అయ్యో అది కాదు రాణి,ఆకాశం చిరిగిపోతోంది.అది మన మీద పడకూడదని పరిగెడుతున్నాం"రొప్పుతూ చెప్పాయి జంతువులన్నీ.
"ఎక్కడ చిరిగింది ఆ కుందేలు బోరియలోనా?" అడిగింది సింహం.
"అవునండీ!నేను పడుకున్న దగ్గరే నాకు ఆకాశం చిరిగిన శబ్ధం వినిపించింది.మీకెలా తెలుసూ..?!" ఆశ్చర్యపోయింది కుందేలు.
"ఇలాంటి విషయాలన్నీ మీకే తెలుస్తాయి కదా..పదా నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నేనుకూడ ఆ చిరుగుతున్న ఆకాశాన్ని చూస్తా."
"అయ్యో వద్దండీ..అది మీ ప్రాణానికే ప్రమాదం."జంతువులన్నీ నచ్చ చెప్పాలని చూసాయి .
"ముందు మీరు నన్ను తీసుకెళ్లండి.ఆ తర్వాత పరిగెత్తడం గురించి ఆలోచిద్దాం"అని సింహం కాస్త గట్టిగానే అనేసరికి వాటికి కుందేలు ఇంటికి తీసుకెళ్ళక తప్పలేదు.అక్కడికి చేరుకోగానే మళ్లీ ఆ శబ్ధం వినిపించింది.
"విన్నరుగా ఆ శబ్ధం..ఆకాశం నిజంగానే చిరిగిపోతుంది రాణీ..పదండి పరిగెడదాం."జంతువులన్నీ కంగారుగా అన్నాయి.
ఆ శబ్ధం మళ్లీ వినిపించింది.జంతువులు కంగారు పడుతూ పరుగందుకోడానికి సిద్ధంగా ఉన్నాయి.
సింహం చెవులు రిక్కించి ఆ శబ్దాన్ని వినడం ప్రారంభించి, పక్కనే ఉన్న గుహ వైపు మెల్లగా నడిచింది.గుహలోకి తొంగి చూసొచ్చి,జంతువులని చూసి "అదిగోండి, మీ చిరుగుతున్నా ఆకాశం.లోపల ఉంది,వెళ్లి ఒక్కో ముక్క తెచ్చుకోండి" అంది సింహం.
పులి ,నక్క ,జింక, కుందేళ్ళు అనుమానంగా గుహలోపలికి అడుగులు వేశాయి.అక్కడ గుడ్డ ముక్కలు చింపుతూ, పెద్ద ఆకులు చీరుతూ మాస్కులు తయారు చేస్తున్న ఎలుగు బంటి కనిపించింది,అంతే! వాటికి విషయం అర్థమైంది.
కాస్త సిగ్గు పడుతూ కాస్త నవ్వుతూ , తలా ఒక మాస్క్ పెట్టుకొని గుహ బయటకి వచ్చిన కుందేలు, జింక, నక్క ,పులులతో "మీకేదైనా విషయం తెలిసినప్పుడు, లేదా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని సరిగ్గా నిర్ధారణ చేసుకోకుండా వేరే వాళ్ళతో పంచుకోకండి. అలా చేసి మీరు భయపడమే కాకుండా ఆ అపోహలు అడవంతా వ్యాపించడం వల్ల అందరిలో అనవసర భయాన్ని పెంచినవాళ్ళవుతారు.అస్సలే పరిస్థితి బాలేదు, అందులో మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి..? ఇకనుంచైన నిజానిజాలు తెలుసుకుని బాధ్యతగా ప్రవర్తించండి"అని సింహం మందలించింది.

 రక్షిత సుమ
03-09-2020