Narayana Sharma Mallavajjala గారి ఈనాటి కవిత-45 గా నా కవిత ‘‘ అడుగులు’’ పై kavi sangamam*కవి సంగమం*(Poetry ) గ్రూపులో చేసిన విశ్లేషణ
ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం.ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు)కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో ,వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు.నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం.