Saturday, March 9, 2013

అడుగులు

డౌటుంటే డాడీనడుగుఅనుమానముంటే అమ్మనడుగు 
ఆచీతూచక అడుగేస్తే 
గడబిడల ప్రపంచంలో
తడబడే ప్రమాదముందని గుర్తెరుగు…

గురి వైపు సాగాలంటే గురువునడుగు
పోగుబడ్డ ప్రపంచ విషయాలను పరిశీలిస్తానని పుస్తకాన్నడుగు
వెనక్కితిరిగి ఓ సారి పసితనాన్ని చూసి
వసివాడని సంతోషాల కొసరడుగు
మసిబారని ఆలోచనల మెరుపడుగు

ఆసరాతగ్గితే నేస్తన్నడుగు
వెలుగెక్కడుందని నీడనడుగు 
గమ్యాన్ని చేరేలా నడవాలంటే,
ముళ్ళకంపల ముద్దుల్ని మందుపాత్రల హద్దుల్నీ
దాటేయాలి నీ ప్రతి అడుగు ….


పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.
ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి.

http://www.facebook.com/groups/kavisangamam/permalink/527665607286196/

No comments:

Post a Comment