Saturday, February 6, 2010

కురుక్షేత్ర సంగ్రామం


మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మద్య హస్తినాపురం సింహాసనం కొరకు జరిగింది. అప్పటి అన్ని రాజ్యాలూ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశము నందు జరిగినది. కురుక్షేత్రం భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉన్నది.

ఈ యుద్ధం పదునెనిమిది రోజులు జరిగినది. మహాభారతంలో ఈ యుద్ధం గురించి భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము మరియు సౌప్తిక పర్వము లందు వివరించి ఉన్నది. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

No comments:

Post a Comment