ఏ రాపిడి లేకుండా నిప్పు ఎలా పుడుతుంది ?
ఏ స్పందన లేకుండా హృదయమెలా బతుకుతుంది ?
చిరు చైతన్యం పెరగకుండా లోకమెలా నడుస్తుంది?
వెలుతురనే చురకుంటే చీకటికే బెరుకు
పసిబుగ్గల నవ్వంటే పాపానికి జడుపు
కొంచెమైన మంచి తలపు మార్పువైపు నడుపు
చదవనిదే మనిషికేల జ్ఞానం మదికెక్కుతుంది ?
చెక్కనిదే రాయి ఎలా శిల్పమై నిలుస్తుంది?
కదలికలే లేకుంటే ఓ సుమా
ఫలితమెలా పుడుతుంది?
మట్టిగొంతు తడిపేందుకు ఒక్కచినుకు చాలు
చెడునడతను ఆపేందుకు ఒక్క చరుపు మేలు
వూహల్లో గీతలకూ వాస్తవాన రూపమేది.
పనిలోనికి మారనిదే జ్ఞానానికి విలువేది.
మదిపరుగులు చాలవసలు కాళ్ళకు పని చెప్పు
చూపులతో ఆశించకు చేతలు నడిపంచు
చీకటిలో చింతించకు చేతన వెలిగించు
చైతన్యపు రూపమై పయనం సాగించు
http://www.facebook.com/groups/kavisangamam/permalink/511267652259325/